మల్కాజిగిరి ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

నవతెలంగాణ -హైదరాబాద్: మల్కాజిగిరి ఎంపీ పదవికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. నన్ను దేశానికి పరిచయం చేసింది మల్కాజిగిరి ప్రజలేనని.. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. తనను ఎంపీగా గెలిపించిన మల్కాజిగిరి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. కాగా, 2019లో మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఘన విజయం సాధించడమే కాకుండా ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.  ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లోక్ సభ సభ్యత్వాన్ని వదులుకున్నారు.

Spread the love