రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో సంబురాలు

నవతెలంగాణ-బెజ్జంకి : తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో మండలంలోని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.గురువారం మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు కడగండ్ల పర్శరాములు అధ్వర్యంలో బాణసంచాలు, టపాసులు కాల్చి సంబురాలు జరిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బంధి అయిన రాష్ట్ర సంకెళ్లను తెంచి స్వేచ్ఛాయుత జీవనం సాగించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజలకు పర్శరాములు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love