రేవంత్ సర్కార్ పై మంద కృష్ణ మాదిగ ఫైర్

నవతెలంగాణ హైదరాబాద్‌: చేయూత పింఛన్‌ తీసుకునే వారిని రేవంత్ ప్రభుత్వం నట్టేట ముంచిందని విమర్శించారు. చేయూత పింఛన్‌దారులందరినీ వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) ఏకీకృతం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆ సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మిన పింఛన్‌దారులు కాంగ్రెస్‌ను గెలిపించారని చెప్పారు. 10 నెలలు అయినా.. ఎందుకు పెంచి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రేవంత్ కంటే చంద్రబాబు చాలా నయం. ఆయన జూన్‌లో అధికారంలోకి రాగానే ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలవి ఇచ్చారు.
తెలంగాణలో వచ్చే నెల మొదటి వారంలో గడిచిన 10 నెలల బకాయిలతో పాటు నవంబర్ పింఛన్‌ ఇవ్వాలి. లేదంటే ఉద్యమం తప్పదు. నవంబర్ 1 నుంచి 16 వరకు ప్రతిరోజు రెండు జిల్లాల్లో చేయూత పింఛన్‌ లబ్ధిదారులకు చైతన్య సభలు నిర్వహిస్తాం. అప్పటికీ ఇవ్వకుంటే నవంబర్ 26న చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తాం 26న వికలాంగుల మహా గర్జన పేరిట వేలాది మందితో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతాం. కాంగ్రెసేతర అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తాం. రేవంత్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం అని మందకృష్ణ అన్నారు.

Spread the love