నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్లో ఉన్నా.. ఏడాది మొత్తానికి అంచనాలు ప్రకటించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* అసెంబ్లీలో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
* బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* మండలిలో బడ్జెట్‌ని ప్రవేశపెడుతున్న మంత్రి శ్రీధర్ బాబు
* రూ.2.90 లక్షల కోట్లతో తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
* తెలంగాణ 2024-25 బడ్జెట్ రూ.2,75,891 కోట్లు
* రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
* మూలధన వ్యయం రూ.29,669 కోట్లు