Revenue Division : రెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం

eturunagaram
eturunagaram

నవతెలంగాణహైదరాబాద్: ములుగు జిల్లా ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

Spread the love