
మండలంలోని బెజ్జోర గ్రామ పరిసరాలలో గల కప్పల వాగును తహసీల్దార్ శ్రీలత మంగళవారం పరిశీలించారు. రాత్రి వేళలో బెజ్జోరా పరిసరాలలో గల కప్పల వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న ఫిర్యాదు మేరకు తాసిల్దార్ రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. వాగు నుండి ఇలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలిస్తే తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. తాసిల్దార్ వెంట ఆరై ధనుంజయ్ ఉన్నారు.