రివర్స్‌గేర్‌!

ఒకరు కొత్త ఉద్యోగాల కోసం బయటి దేశాలకు పోతే.. మరొకరేమో మన దేశంలోనే ఉన్న ఉద్యోగాలను ఊడపీకే పని చేస్తున్నారు. ఇంతకు ఎవరి గురించి అనుకుంటున్నారా?.. గదే ఢిల్లీలోని బీజేపీ సర్కార్‌ మానిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతూ కోట్లాది కొలువులను ఊడబీకింది. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాల మాటేమోగాని ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేసింది. మరి రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మంత్రి కేటీఆరేమో పెట్టుబడులు తీసుకొచ్చి కొలువులను కల్పిం చేందుకు బయటికి దేశాలకెళ్లొచ్చారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు సందర్భంగా ఇరుపార్టీల నేతలు హామీల గురించి విమర్శలు చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ సర్కార్‌ సంగతి గురిగింజ తీరులా ఉందని జనాలు ముక్కునేలేసుంటున్నారు!
-నిరంజన్‌ కొప్పు

Spread the love