నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఈ పంచాయతీ ఆపరేటర్లతో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల అభివృద్ధిలో ముఖ్యమైన 10 శాఖలపై సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం వివరాలు సేకరించేందుకు వ్యవసాయం, వైద్య ఆరోగ్య, శ్రీ శిశు సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, పౌరసరఫరాల శాఖ, మిషన్ భగీరథ, విద్య తదితర శాఖల అధికారులతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఆయా శాఖలకు సంబంధించిన వివరాలను సేకరించి ఆన్ లైన్ లో పొందుపరచనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సమావేశంలో ప్రజా పాలనలో ఆరుగారంటీల దరఖాస్తులపై చర్చించారు. ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీ ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు గ్యారంటీలో అందకపోతే ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రూ.500 కే గ్యాస్ సిలిండర్ రానట్లయితే లబ్ధిదారులు ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తు రసీదు తో పాటు గ్యాస్ ఏజెన్సీ బిల్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ లతో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అర్హులకు అందకపోతే కూడా ఎంపీడీవో కార్యాలయంలో సంబంధిత పత్రాలతో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్, తదితరులు పాల్గొన్నారు.