తూతూ మంత్రంగా దశాబ్ధి ఉత్సవాల సమీక్ష

– హాజరు కానీ ఏఓ గణేష్
– నామ మాత్రంగా హాజరైన పంచాయతీ కార్యదర్శులు
నవతెలంగాణ-వీణవంక
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అట్టహాసంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలకు తోలి రోజు నిర్వహించిన సమావేశంలో అధికారుల అలసత్వం బయల్పడింది. ఉత్సవాలల్లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. కానీ ఈ సమావేశానికి మండల వ్యవసాయ అధికారి గణేష్ మాత్రం హాజరు కాలేదు. ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక పాల్గొనగా మండలంలోని ఐదుగురు ఏఈవోలు హాజరయ్యారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు పూర్తి స్థాయిలో హాజరుకావాల్సి ఉన్నా ఈ సమావేశానికి కొందరు మాత్రమే హాజరయ్యారు. దీంతో అధికారులు తూతూ మంత్రంగా సమావేశాన్ని ముగించేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ  ఈ ఉత్సవాల సందర్భంగా 3న రైతు దినోత్సవం సందర్భంగా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

Spread the love