
మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ గురువారం ముసాయిదా ఓటరు జాబితా పై వివిధ రాజకీయ పార్టీల నాయకులతోసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈనెల 13న మండలంలోని 14 గ్రామపంచాయతీలోని 138 వార్డులకు సంబంధించి వార్డుల వారిగా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై చర్చించారు. ముసాయిదా ఓటరు జాబితా పై ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే ఈ నెల 21 వరకు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 26 లాగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈనెల 28న తుది ఫోటో ఎలక్ట్రోల్ జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో ప్రచురించడం జరుగుతుందని రాజకీయ పార్టీల నాయకులకు తెలిపారు. తుది జాబితా తయారీలో ఆయా పార్టీల నాయకులు తమకు సహకరించాలని ఎంపీడీవో కోరారు. టుడే వాటర్ జాబితా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా ఆయన పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదానంద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, కొత్తపల్లి రఘు, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు కట్ట సంజీవ్ కుమార్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు సారా సురేష్, తదితరులు పాల్గొన్నారు.