నవతెలంగాణ-హైదరాబాద్ : సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకు నా 4 ప్రశ్నలు’ అంటూ పోస్టు పెట్టారు. ఆర్జీవీ అడిగిన ప్రశ్నలివీ..
- పుష్కరాలు, బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా?
- ఎన్నికల ప్రచారాల తొక్కసలాటలో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా?
- సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లని అరెస్టు చేస్తారా?
- భద్రత ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు తప్ప హీరోలు, నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు?