నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల రెవెన్యూ కార్యాలయం అధికారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శనివారం లక్ష్మాపూర్ గ్రామంలో విధి నిర్వహణలో భాగంగా అంగన్వాడి సెంటర్ ను సందర్శించిన అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు చేరుకొని బడి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడి వారితోపాటు కలిసి పాఠశాలలో ఏర్పాటుచేసిన రాగి జావా తాగి సంతోషాన్ని వ్యక్తం చేశారు. బడి పిల్లలు వ్యవసాయ పనులకు దూరంగా ఉండి పాఠశాలకు దగ్గరై మీ జీవితానికి తొలిమెట్టుగా ఇప్పటినుంచి క్రమశిక్షణతో చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.