ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపెళ్లి గ్రామానికి చెందిన పిల్లి కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందగా, అతని దశదినకర్మకు “పస్రా టూ మేడారం” సహస్ర ఆటో యూనియన్ కోశాధికారి ఐలీ అశోక్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు, నాయకులు శనివారం 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లి కుమార్ చాలా మంచివారని, ఆయన మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. ఆయన ద్విచక్ర వాహనంపై ప్రమాదవశాత్తు పడి మృతి చెందడం చాలా బాధాకరం ఉన్నారు. ఈ కార్యక్రమంలో సహస్ర ఆటో యూనియన్ సీనియర్ నాయకులు కాళిదాసు, అంజి, వెంకన్న, ప్రకాష్, సురేష్, మధు, లక్ష్మణ్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.