నవతెలంగాణ-హైదరాబాద్ : కుమురం భీం జిల్లా సిర్పూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. భారాస సిర్పూరు అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అండతోనే ఆయన వర్గీయులు పలు పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. గురువారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణంలోని 90వ పోలింగ్ కేంద్రం వద్ద బీఎస్పీ శ్రేణులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలింగ్‌బూత్ నంబర్లు 55, 56, 75, 90లలోని ఈవీఎంలలో భారాస నాయకులు.. అధికారుల అండతో యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారన్నారు. ఆయా కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.