ఓటు హక్కు మన జన్మ హక్కు

– త్రివేణి పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఓటు హక్కు మన జన్మ హక్కు అని, నేటి బాలలే రేపటి బావిభారత పౌరులని, ప్రజా స్వామ్య సౌధానికి వారే పునాదులని చింతల్‌ బ్రాంచ్‌ త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్‌ ఈ.వి. సుబ్బారావు అన్నారు. మంగళవారం కుత్బు ల్లాపూర్‌ సర్కిల్‌ పరిధి త్రివేణి పాఠశాల ప్రాం గణంలో విద్యార్థులకు (ఓటు హక్కు లేకున్నా) ”ఓటు విలువ – మన హక్కు” అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యా ర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తప్పకుండా ఓటేయాలని అమ్మానాన్నలకు ప్రత్యేకంగా గుర్తు చేస్తామని అధ్యాపక బందంతో కలిసి విద్యా ర్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విద్యా ర్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రపం చంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలలో ఓటు వేయటం, ప్రతి భారతదేశ పౌరుని హక్కు అని, విధిగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సి.ఆర్‌.ఓ. వెంకట్రావు, కిడ్స్‌ ప్రిన్సిపల్‌ నళిని, ఇంచార్జ్‌ క్రాంతి, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love