పెరిగిన రిషి సునాక్ దంపతుల ఆస్తులు…

 

నవతెలంగాణ – బ్రిటన్: బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతామూర్తిల ఆస్తులు  బ్రిటన్ రాజు చార్లెస్‌ III కంటే ఎక్కువని తేలింది. రెండేళ్ల క్రితం సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సునాక్‌ దంపతులు.. గతేడాది 275వ స్థానంలో నిలువగా.. తాజా జాబితాలో వీరు 245వ స్థానంలో నిలిచినట్లు సమాచారం. బ్రిటన్‌లో నివసిస్తోన్న తొలి వెయ్యి మంది సంపన్న కుటుంబాల సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్‌ తాజా జాబితా విడుదల చేసింది. ఇందులో కింగ్‌ చార్లెస్‌ సంపద గత ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు చేరగా..సునాక్‌ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్‌ పౌండ్ల నుంచి 651 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది. అయితే, రాజ కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని తాజా నివేదిక వెల్లడించింది.

Spread the love