నవతెలంగాణ-మట్టెవాడ
ఎన్‌ఎంసి ఆర్‌ఎంపి నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్ , మెడికల్ షాపుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు డివైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి ధర్మారపు సాంబమూర్తి అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వైద్య శాఖ అధికారి కాజీపేట వెంకటరమణకు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ప్రజలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న ఆర్.ఎం.పి ప్రైవేట్ మెడికల్ షాపుల యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం మెమొరండాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగల్ జిల్లాలో 2023 ఎన్‌ఎంసి ఆర్‌ఎంపి రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ నిబంధనలను పాటించకుండా పెద్ద ఎత్తున ధనార్జనే ధ్యేయంగా ఆర్‌ఎంపీలు అవసరం లేకున్నా అమాయకులైనటువంటి ప్రజల ఆరోగ్య పరిస్థితులను దష్టిలో పెట్టుకొని బ్రాండెడ్ మందులను యాంటీబయాటిక్స్, గ్లూకోజ్ బాటిల్, ఇంజక్షన్లను ప్రిఫర్ చేస్తూ వారు నిబంధనలను మరిచి మెడికల్ షాపులతో ఒప్పందం కుదుర్చుకొని అవసరం లేకపోయినా రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేయిస్తూ ధనాన్ని సొమ్ము చేసుకుంటున్నారనీ అన్నారు. ఎన్‌ఎంసి ఆర్‌ఎంపి నిబంధనల ప్రకారం ఆర్.ఎం.పి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి అందరూ చదివే రీతిలో ప్రిస్క్రిప్టు ఉండాలి కానీ వీటికి విరుద్ధంగా ఆర్.ఎం.పి లందరూ కూడా వ్యవహరిస్తున్నారు కేవలం బ్రాండెడ్ మందులనే రాస్తూ సంపాదన సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. కానీ ఎన్ ఎం సి జనరిక్ మెడిసిన్ ని మాత్రమే డిస్క్రిప్ చేయాలని అలా చేయడం వలన వైద్య ఖర్చులు 30 శాతం నుండి 80 శాతం వరకు తగ్గించడంతోపాటు అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణలో అందించినట్లు అవుతుందని ఎన్‌ఎంసి తన నిబంధనలో పేర్కొనడం జరిగిందనీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆర్‌ఎంపీలపై మెడికల్ షాపుల యాజమాన్యాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని వారి లైసెన్సులను రద్దు చేయాలని డివైఎఫ్‌ఐ వరంగల్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాట్లు పేర్కొన్నారు. అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రజలకు జనరిక్ మందులపై అవగాహనను కల్పించాలని డి ఎం హెచ్ ఓ ను కోరడం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొక్క చిరంజీవి, గద్దల ప్రశాంత్, బేతి రాజేష్, ఎండి సమీర్, కాలువ నరేష్ ,దూడం రాజేష్, గోపిరెడ్డి క్రాంతి, గోగుల బాబు, సుగుణాకర్, కంచర్ల విక్రం, తదితరులు పాల్గొన్నారు.