తమిళనాడు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు జిల్లాలో కంటైనర్‌ను ఆటో ఢీకొన్న ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయాలైన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులంతా చెన్నైకి చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.