– తహసీల్దార్ కు వినతి పత్రం అందజేత
ఏంజెల్ మండలం కందకుర్తి గ్రామం నుంచి బోర్గం బైపాస్ రోడ్డు ద్వారా అక్రమంగా ఇసుక టిప్పర్లు నడుస్తూ ఉండడంతో, పొలాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, పూర్తి గ్రామానికి చెందిన రైతులు తాసిల్దార్ రామచందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇటీవల ఈ రోడ్డు మరమ్మల కోసం రెండు లక్షల రూపాయల మొరం పనులు చేపట్టినప్పటికీ, అక్రమ ఇసుక టిప్పర్లు నడుస్తూ ఉండడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక తరలిపోకుండా తగు జాగ్రత్తలను తీసుకోవాలని వారు కోరారు. పరితంగా టిప్పర్లు వెళ్తూ ఉండడంతో రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రైతులకు నానా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిలు, మాజీఉప సర్పంచ్ డి. యోగేష్, సురేష్, ఖలీద్గ్ బేగ్, సాజిద్ బేగ్, శ్రీనివాస్, తదితరులు ఎమ్మార్వో కు ఇచ్చిన వనితి పత్రంలో పాల్గొన్నారు.