ఏపీలో రహదారులు రక్తసిక్తం

ఏపీలో రహదారులు రక్తసిక్తం– వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి
– గువ్వల చెరువు ఘాట్‌రోడ్డు ఐదుగురు.. దువ్వూరులో ముగ్గురు
కడప : కడప జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు. కారును కంటైనర్‌ ఢకొీనడంతో ఐదుగురు మరణించగా…అదుపు తప్పి కారు బోల్తా పడి ముగ్గురు మరణించారు. పోలీసుల వివరాల మేరకు..
కడప జిల్లా చక్రాయపేట మండలం కుప్పం పంచాయతీ కొండుగారిపల్లె వడ్డేపల్లి గ్రామానికి చెందిన వల్లెపు చిన్న వెంకటమ్మ (50) భర్త ఇటీవల మృతిచెందాడు. పెద్ద ఖర్మ కార్యక్రమం అనంతరం ఆమె తన తల్లి ఇల్లు గువ్వల చెరువుకు తన కోడలు పల్లెపు నాగలక్ష్మి (35), కుమారుడు గుజ్జుగారినాగయ్య (46), చక్రాయపేట మండల ఉప్పలవారిపల్లె గ్రామానికి చెందిన ఖాడుమియ్య (38)తో కలిసి కారులో బయలు దేరారు. గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కంటైనర్‌ కారును వేగంగా ఢకొీట్టింది. అదుపుతప్పి కంటైనర్‌ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కారులోని నలుగురితోపాటు, కంటైనర్‌ డ్రైవర్‌ మహబూబ్‌ షరీఫ్‌ (38) అక్కడికక్కడే మృతిచెందారు. క్లీనర్‌ పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలుకు ఓ చెందిన కుటుంబం తమ పాప పుట్టెంట్రుకలు కోసం తుపాను వాహనంలో తిరుమలకు బయలుదేరారు. కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్దకు రాగానే  వారి వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కియాన్‌సింగ్‌ (9నెలలు), భగత్‌సింగ్‌ (34), నాగలక్ష్మి (55) మృతిచెందారు. యుగంధర్‌, ఉమామహేశ్వరి, సాయి,  కల్యాణ్‌సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love