కాలువలు తలపిస్తున్న రోడ్లు..

Roads facing canals..– రోడ్లపై వరి నాట్లు వేస్తున్న యువకులు..
నవతెలంగాణ – కొనరావుపేట 
ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన మా గ్రామ రోడ్డును బాగు చేసే నాయకులే లేరని కొనరో పేట మండలం మంగళపల్లి గ్రామ యువకులు  ప్రధాన రోడ్లపై వరి నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మా గ్రామము జిల్లాలోనే తారు రోడ్డు లేని గ్రామం అని ఎన్నికల ముందు నాయకులు వచ్చి మీ రోడ్డు బాగు చేస్తామని మంజూరు చేశామని గత ప్రభుత్వం ప్రకటనలు చేసింది. కానీ కొత్త ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఆ రోడ్డు పనులు ప్రారంభించలేదు గ్రామంలోని ప్రధాన వీధుల్లో వర్షం వస్తే చాలు రోడ్లపై నీళ్లు వచ్చి గ్రామస్తులకు ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఇకనైనా మా గ్రామంలో వీధుల్లో రోడ్లు ప్రధాన రోడ్డు తారు రోడ్డుగా మార్చాలని యువకులు ప్రభుత్వాన్ని కోరారు.
Spread the love