రోడ్లు వేసారు… కల్వర్టు మరిచారు…

– ఇక్కట్లు పడుతున్న పట్టణ వాసులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
అధినేతలు విధానాలు రూపొందిస్తారు. అధికారులు అమలు చేస్తారు. ఈ ఇరువురి మధ్య సమన్వయ లోపం ప్రజలకు ఇక్కట్లు కల్పిస్తుంది.
దీనికి మంచి ఉదాహరణ మేజర్ పంచాయితీ అశ్వారావుపేటలో గల మసీదు వీధి స్థితి. రెండు రోడ్లు మద్య కల్వర్టు నిర్మించి అనుసంధానం చేయాల్సిన పరిస్థితి ఉన్నా దాన్ని మారిపోవడంతో వచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. మసీదు పక్క వీధి కి సీ సీ రోడ్డు నిర్మించారు.మసీదు ముందుగా గాంధీ కూడలి నుండి పేట మాలపల్లి కలుపుతూ బీటీ రోడ్డు వేసారు. కానీ ఈ రెంటిని అనుసంధానం చేయడం మరిచారు.దీంతో చిన్నపాటి వాన కే కాలువ పొంగి వరద నీరు రోడ్డు పై పొర్లుతుంది. బురద ఏర్పడుతుంది.ఈ కారణంగా అటుగా రాకపోకలు సాగించే పాదచారులు,వాహన దారులు పడిపోయి ప్రమాదానికి గురౌతున్నారు అని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. అధికారులు కల్వర్టు నిర్మించి ఈ రెండు రోడ్లను అనుసంధానం చేయాలని కోరుతున్నారు.
త్వరలో కల్వర్టు నిర్మించి ఆ రోడ్లను అనుసంధానం చేస్తాం – ఈ.ఒ హరిక్రిష్ణ
ఈ విషయం అయి ఈ.ఓ సారి క్రిష్ణ ను వివరణ కోరగా మా దృష్టికి వచ్చిందని,త్వరలో కల్వర్టు నిర్మించి ఆ రెండు రోడ్లను అనుసంధానం చేస్తాం అన్నారు.
Spread the love