నవతెలంగాణ – హైదరాబాద్: నవంబరు 22 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో మొదటి టెస్టు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు టీమిండియా సారథి రోహిత్ శర్మ దూరం కానున్నాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో రోహిత్ శర్మ జట్టుతో పాటే ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడు. అతడు మరికొన్ని రోజుల పాటు భారత్ లోనే ఉంటాడని తెలుస్తోంది. రెండో టెస్టుకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్ సమయానికి రోహిత్ శర్మ జట్టుతో చేరే అవకాశాలున్నాయి. ఇక, రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో… టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.