కుటుంబ సమేతంగా తిరుమల దర్శించుకున్న రోహిత్ శర్మ

నవతెలంగాణ – హైదరాబాద్:  వెస్టిండీస్ తో టెస్టు, వన్డే సిరీస్ ముగిసిన అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ భారత్ తిరిగొచ్చాడు. రోహిత్ శర్మ ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల దర్శించుకున్నాడు. వీఐపీ బ్రేక్ సమయంలో భార్య రితికా సజ్దే, కుమార్తె సమైరాలతో కలిసి స్వామివారిని సేవించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా, స్వామివారి ఆలయంలో రోహిత్ శర్మ కుటుంబానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనాలతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Spread the love