జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్‌గా రొనాల్డ్ రోస్

నవతెలంగాణ – హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు కొత్త కమిషనర్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రోస్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ను రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా లోకేశ్ కుమార్ ను బదలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో బల్దియా బాధ్యతలను రొనాల్డ్ రోస్ కు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్ ను రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారిగా ఈసీ నియమించింది.

Spread the love