కాంగ్రెస్ పార్టీలో చేరిన గులాబీ  సింగిల్ విండోడైరెక్టర్లు 

– కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు 
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బిఆర్ఎస్ పార్టీకి చెందిన  వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు,సింగిల్ విండో డైరెక్టర్ బానోతు సర్వీనాయక్ లు గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి దుద్దిళ్ల కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు.అనంతరం డైరెక్టర్లు మంత్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు పాల్గొన్నారు.
Spread the love