టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లో మ్యాచ్ జరగనుంది.ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇందులో హైదరాబాద్ జట్టు హాట్ ఫేవరెట్ గా ఉంది. ఇప్పుడు వరకు మూడు విజయాలతో దూసుకుపోతోంది హైదరాబాద్ జట్టు. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం ఒకే ఒక్క విజయాన్ని సొంతం చేసుకొని… వరుస ఓటములతో సతమతమవుతోంది.

Spread the love