RR vs RCB : టాస్ గెలిచిన రాజస్తాన్..బెంగళూరు బ్యాటింగ్

నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్ వేదికగా నేడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నువ్వా, నేనా అన్న మ్యాచ్ జరుగనున్నది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కొద్దిసేపట్లో ఈ నువ్వా, నేనా అన్న మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ లో ఓడిన వారు ఇక ఇంటికే. గెలిచినవారు సన్ రైజర్స్ తో పైనల్ కోసం తలపడనుంది. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కు దిగనుంది.

Spread the love