బీసీలందరికీ రూ.లక్ష పథకం అమలు చేయాలి

నవతెలంగాణ-వీణవంక
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ కులాల్లోని కొన్ని కులాలకు రూ.లక్ష పథకం అన్ని కులాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీసీ యువజన సంఘం మండల అధ్యక్షులు మద్దుల ప్రశాంత్ అధ్యక్షతన మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 136 కులాలకు ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు. ఈ స్కీం గడువు ఇంకా నెల రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. కుల వృత్తుల వారికి కాకుండా బీసీలలో ఉన్నటువంటి 136 కులాలకు కుటుంబానికి 10 లక్షల ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంతోష్, ఓం ప్రకాష్, రాజు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love