‘తిరుమలలోని పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం’

నవతెలంగాణ  – హైదరాబాద్: తిరుమలలోని పరకామణిలో రూ.100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు వినతి పత్రాన్ని అందించారు. సి.వి.రవికుమార్‌ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించే వారని, ఆయన రహస్యంగా రూ.200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని కోరారు.
Spread the love