నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకకు చెందిన ఒక మెకానిక్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. మాండ్య జిల్లాకు చెందిన అల్తాఫ్ కేరళ లాటరీలో రూ.25 కోట్లను గెల్చుకున్నాడు. కేరళకు చెందిన తిరువోణం బంపర్ లాటరీ ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఇస్తుంది. గత 15 ఏళ్లుగా తాను లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇన్నాళ్లకు తనను అదృష్టం వరించిందిని అల్తాఫ్ తెలిపాడు.