దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్‌పై రూ.3500 జరిమానా

Masala-Dosaనవతెలంగాణ – బీహార్‌
దోసెలో సాంబార్ ఇవ్వని రెస్టారెంట్‌కు చుక్కలు చూపించాడో లాయర్. వినియోగదారుల కోర్టులో కేసు వేసి భారీ మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది రూ.140 పెట్టి ఓ స్పెషల్ మసాలా దోసె పార్శిల్ ఆర్డర్ ఇచ్చారు. కానీ, ఇంటికొచ్చిన పార్శిల్‌లో దోసె, చట్నీ తప్ప సాంబార్ జాడ కానరాలేదు. దీంతో, ఆయన వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. 11 నెలల పాటు న్యాయపోరాటం చేశారు. న్యాయస్థానం చివరకు రెస్టారెంట్ నిర్వాహకులదే తప్పని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఆ రెస్టారెంట్‌పై ఏకంగా రూ.3500 జరిమానా విధించింది. నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని గడువు విధించిన కమిషన్, జాప్యం జరిగితే 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది.

Spread the love