నవతెలంగాణ-హైదరాబాద్ : మద్యం అక్రమాలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ జరిమానాలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే రూ. 5 లక్షలు జరిమానా విధించనున్నారు. మరోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్‌షాపులు నిర్వహిస్తే రూ.5 లక్షల జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఎపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.