బ్యాగులో రూ. 57 లక్షల విదేశీ కరెన్సీ..

– పట్టుకున్న సిఐఎస్‌ఎఫ్‌ పోలీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 57 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్‌ ఫైజిల్‌ అనే వ్యక్తి నుంచి సిఐఎస్‌ఎఫ్‌ దళాలు యుఎఇకి చెందిన దిర్హమ్‌ కరెన్సీని సీజ్‌ చేశారు. సుమారు 2,85,500 దిర్హమ్‌లను పట్టుకున్నారు. ఆ కరెన్సీ విలువ 57 లక్షలు ఉంటుంది. ఫైజిల్‌ దుబారుకు వెళ్తున్నట్లు గురించారు. అంత భారీ మొత్తం కరెన్సీ తీసుకువెళ్తున్న అతను దానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపించలేకపోయాడు. అతన్ని కస్టమ్స్‌ అధికారులకు అందజేశారు.

Spread the love