నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ రవాణా శాఖ (ఆర్టీఏ)లో సర్వర్లు మొరాయించాయి. నేడు ఉన్నట్టుండి ఆర్టీఏ సర్వర్లు డౌన్ కావడంతో కలకలం రేగింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టీఏ వెబ్ సైట్ లో పాత, కొత్త వాహనాల వివరాలు కనిపించలేదు. ఈ క్రమంలో, తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. సర్వర్లు డౌన్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. సాంకేతిక నిపుణుల సాయంతో సమస్యను పరిష్కరించేందుకు శ్రమిస్తున్నారు.