ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్.. పలువురికి త్రీవ గాయాలు

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో బస్సు పలు వాహనాల పైకి దూసుకుపోయింది. ఈ క్రమంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు హయత్ నగర్ పరిధిలోని భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద దిల్‌సుఖ్ నగర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయ్యింది.  దీనితో బస్సు ముందు ఉన్న వాహనాలను ఢికొట్టింది. ఈ ఘటనలో రెండు ఆటోలు, అనేక బైకులు, రెండు కార్లు ప్రమాదానికి గురైయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ ఆటో లోని మహిళ తల పగులగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికుల సమాచారం అనుదుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అలానే ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిల్ అయిన విషయం గమనించిన బస్సు డ్రైవర్ బ్రేక్ ఫెయిల్ అయ్యిందని పక్కకు తప్పుకోమని పెద్దగా అరిచినట్లు స్థానికులు తెలిపారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love