నవతెలంగాణ-హైదరాబాద్ : వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన పెబ్బేరు మండలం రంగాపురం పొగాకు కంపెనీ వద్ద గల జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రంగాపురం గ్రామానికి చెందిన పెండ్లి రాముడు (60) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మసీద్ శేఖర్ (58) తీవ్రంగా గాయపడగా హైవే అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదారాబాద్ నుంచి కర్నూల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు.. రంగాపురం వద్దకు రాగానే టీవీఎస్ఎక్స్ ఎల్ వాహనంపై వెళ్తున్న రాముడు, శేఖర్‌ను ఢీ కొట్టింది. సమాచారం అందు కున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాముడు, శేఖర్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.