వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్‌…

నవతెలంగాణ – నల్లగొండ: నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోదాడ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్‌ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుంది. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామశివారులో జాతీయ రహదారిపై ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను అతివేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న 25 మందికి గాయాలు కాగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ ప్రయాణికులను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Spread the love