– వ్యక్తి అక్కడిక్కడే మృతి
– తిమ్మాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం
– కల్వకుంట్ల గ్రామస్తుడిగా గుర్తింపు
– కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
నవతెలంగాణ – దుబ్బాక రూరల్ : ముందు వెళ్తున్న కారుని తప్పించబోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వహనదారున్ని 100 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకేళ్ళడంతో అక్కడికక్కడే మృత్యు వాత పడ్డాడు. ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై( బెడ బుడగజంగాల వైకుంఠ ధామం వద్ద) ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన పురుషోత్తం (32)
వృత్తి రీత్యా లేబర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం అమావాస్య కావడంతో పనికి సంబంధించి లెక్కలు చేసుకోడానికి ఉదయం సిద్దిపేట వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణంలో తిమ్మాపూర్లో మెదక్ నుంచి సిద్దిపేట వెళ్తున్న మెదక్ డిపోకి చెందిన ప్రైవేట్ ఆర్టీసీ బస్సు టీఏస్ 35 టీ 6899 ఢీ కొట్టింది.దీంతో పురుషోత్తం అక్కడిక్కడే మృతి చెందాడు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.మృతదేహాన్ని దుబ్బాక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా ఆర్టీసీ బస్సును డ్రైవర్ మధు స్టేషన్ కి తరలించినట్లు దుబ్బాక పోలీసులు తెలిపారు.