మహిళ రెండు కాళ్ళపై వెళ్ళిన ఆర్టీసీ బస్సు..

నవతెలంగాణ – ఆర్మూర్ 

మహిళ రెండు కాళ్లు పైనుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిన సంఘటన బుధవారం ఆర్మూర్ బస్టాండ్ పరిధిలో చోటుచేసుకుంది. నిజామాబాద్ నుండి నిర్మల్ వెళ్తున్న టిఎస్ 18 టి 5355 బస్సు ఆర్మూర్ బస్టాండ్ లో గల స్టేజి వద్ద నిలిపాడు. డ్రైవర్ బస్సులు గమ్యస్థానానికి చేర్చడం కోసం వెనుకకు తీస్తున్న క్రమంలో సుజాత (50) అనే మహిళ అజాగ్రత్తగా బస్సు ఆపమంటూ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. వెనుకవైపు నుండి వచ్చిన మహిళను డ్రైవర్ గమనించకపోవడంతో  బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుండి వెళ్ళాయి. దీంతో త్రీవ రక్త స్రావమై రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అశోక్ అంబులెన్స్ ను పిలిపించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Spread the love