ఆర్‌టీసీ ఉద్యోగులు టీష‌ర్ట్‌, జీన్స్ వేసుకోవ‌ద్దు: స‌జ్జ‌నార్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీలో టీష‌ర్ట్స్‌, జీన్ వేసుకోవ‌ద్ద‌ని టీఎస్ ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌స్తుతం ఆర్‌టీసీ డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లు ఖాకీ యూనిఫామ్ ధ‌రిస్తున్నారు. మిగ‌తా ఉద్యోగులకు డ్రెస్ కోడ్ లేక‌పోవ‌డంతో క్యాజువ‌ల్స్‌లోనే కార్పొరేష‌న్‌, డిపోలకు విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇక నుంచి ఆర్‌టీసీ ఉద్యోగులంద‌రూ డిగ్నిటీగా ఉండేందుకు ఫార్మ‌ల్స్, యూనిఫామ్‌లో రావాల‌ని ఎండీ స‌జ్జ‌నార్ సూచించారు.

Spread the love