నవతెలంగాణ – హైదరాబాద్: టీజీఎస్ ఆర్టీసీలో త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామని తెలిపారు. కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల డీజిల్‌తో నడిచే బస్సు ఒక్కటి కూడా ఉండకుండా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ విద్యుత్ బస్సు సర్వీసులు నడపాలన్నదే తమ లక్ష్యమని ఈ సందర్బంగా మంత్రి స్పష్టం చేశారు.