ఆర్టీసీ మనందరిదీ : మంత్రి పొన్నం

నవతెలంగాణ –  హైదరాబాద్ : ఆర్టీసీ  సంస్థ మనందరిదీ. దానిని కాపాడుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండాపూర్ 8వ బెటాలియన్ లో టీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్ ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం, వివిధ రకాల ప్రమాదాలలో మృతి చెందిన కుటుంబాలకి కారుణ్య నియామకాల కింద ఎనిమిది వందల మందికి పైగా నియామకాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. అందులో భాగంగా ఈరోజు కొంతమంది కానిస్టేబుల్స్ కి నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఆర్టీసీ సంస్థని తిరిగి తెలంగాణకి ప్రజలకి నెంబర్ వన్ రవాణా సంస్థగా చేయడమే తమ లక్ష్యం అన్నారు.

Spread the love