నవతెలంగాణ కమ్మర్ పల్లి: శాసనసభ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి నిత్యం తన విజయం కొరకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి, బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకైనా శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల అభిమానం, ఆధరణతో బాల్కొండ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరబోతుందని, బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాదిస్తుందని పేర్కొన్నారు. ఈ విజయం కోసం రాత్రి, పగలు కష్టపడిన అందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓటింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించిన ఎన్నికల అధికారులకు అభినందనలు తెలిపారు. సహకారం అందించిన మీడియా సంస్థలకు, విలేఖరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మీ అందరి అభిమానం, సహకారం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు.