ఎమ్మెల్యే ని కలిసిన రుద్రంగి రైతులు

నవతెలంగాణ-రుద్రంగి 
రుద్రంగి మండల కేంద్రంనికి చెందిన కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు శుక్రవారం నూతనంగా ఎన్నికైన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను వేములవాడలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.వారి వెంట డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి ఉన్నారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.నూతన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రైతులు అభిమానులు పెద్ద ఎత్తున కలిసి శుభాకాంక్షలు తెలియ జేశామని అన్నారు.మండల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేయాలని కోరారు.నిరంతరం ప్రజల మధ్య ఉండే ఆయనకు మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love