పాలకులు పట్టించుకోరు.. అధికారులు స్పందించరు..

– రామంతపూర్‌లో నిరుపయోగంగా మారిన ఓపెన్‌ జిమ్ములు
– ఎవరి స్వలాభం కోసం అధికారులు స్పందిస్తలేరు?
నవతెలంగాణ-ఉప్పల్‌
రామంతపూర్‌ డివిజన్‌లోని చిన్న చెరువులో ఓపెన్‌ జిమ్‌ మరమతులను వెంటనే చేపట్టి ప్రజలకు అం దుబాటులో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎర్రం శ్రీనివాస్‌ కాల నీవాసులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ఓపెన్‌ జిమ్‌లో పనిముట్లు పాడై ఓపెన్‌ జిమ్‌ నిరుప యోగంగా మారిన, స్థానిక పాలకులకు అధికారులకు ఎన్నిసార్లు సమస్యలు విన్నవించిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడని, ప్రజా సమస్యలను పరిష్క రించలేని పాలకులు ఎందుకు అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులు పట్టించుకోరు అధికా రులు స్పందించకుంటే తమ సమస్యలు ఎవరికి విన్నవిం చుకోవాలని కాలనీవాసులు వాపోతున్నారు.
ఎవరి స్వలాభం కోసం అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు?
రామంతపూర్‌ చిన్నచెరువులో లక్షలు వెచ్చించి ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు అవి నిరుపయోగంగా ఉన్నా వాటి నిర్వహణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టక పోవ డం పై అను మానాలకు తావనిస్తున్నాయని ప్రజలు వా పోతున్నారు. పాలకుల, ప్రజా ప్రతినిధుల అధికారులపై ఒత్తిడితోనే ఓపెన్‌ జిమ్‌ లను మరమ్మతులు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైన సం బంధిత అధికారులు ఓపెన్‌ జిమ్‌లు మరమ్మతుల విష యంలో స్పందించకపోతే మున్సిపల్‌ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

Spread the love