పేద ప్రజల నడ్డి విరుస్తున్న పాలకులు

– ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి అ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
పాలకుల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల పేద ప్రజల నడ్డి విరిస్తున్నారని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ వ్యవస్థ పటిష్ట పరచాలని రేషన్‌ షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలని, నిత్యావసర సరుకులు ధరలు తగ్గించాలని, కూరగాయల ధరలు, గ్యాస్‌ ధరలు తగ్గించాలని కలెక్టరేట్‌ ఎదుట మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. అనంతర నాదెండ్ల లీలావతి అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్‌ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఈ ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయన్నారు. అనంతరం డీఆర్‌ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు డి.లక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి సందకూరి లక్ష్మి, జి.జ్యోతి, సరోజినీ, క్రాంతి, సిహెచ్‌ రమ తదితరులు పాల్గొన్నారు.

Spread the love