వ్యవసాయ విద్యార్ధుల క్రీడల్లో పరుగుల రాయుడు….

– చదివేది రుద్రూరు…
– స్వంత ఊరు అశ్వారావుపేట..
– పరుగుల్లో సత్తా చాటిన బాల క్రిష్ణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023 – 2024 విద్యాసంవత్సరం అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెంకు చెందిన భూక్యా నాగేశ్వరరావు కుమారుడు బాల క్రిష్ణ పరుగుల విభాగంలో సత్తా చాటాడు.బాలక్రిష్ణ రుద్రూరు కమ్యూనిటీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రీడలు ఈ నెల 5 వ తేదీ సోమవారం నుండి 8 వ తేదీ గురువారం వరకు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించారు.
       ఈ క్రీడల్లో బాల క్రిష్ణ పరుగుల విభాగం లోని అన్ని ఈవెంట్లలో ప్రతిభ కనబరిచాడు. 400, 800,1500, 3000 మీటర్ల లో ప్రథమ,100 మీటర్లలో ద్వితీయ, 4 × 400 మీటర్లలో తృతీయ స్థానం సాధించిన పరుగులు రాయుడు అనిపించుకున్నాడు.  రుద్రూరు, అశ్వారావుపేట కళాశాల యాజమాన్యాలు బాల క్రిష్ణకు అభినందలు తెలిపారు.
Spread the love