ఫోన్‌పేలో రూపే క్రెడిట్‌ కార్డ్‌ లింక్‌

బెంగళూరు: ప్రముఖ చెల్లింపుల వేదిక ఫోన్‌పేలో యుపిఐ చెల్లింపులకు వీలుగా విజయవంతంగా రూపే క్రెడిట్‌ కార్డ్‌ను అను సంధానం సదుపాయాన్ని కల్పించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. యుపిఐ చెల్లింపుల కోసం క్రెడిట్‌ కార్డ్‌ అనుసంధానం దేశంలోనే తొలిసారి అని ఫోన్‌ పే వెల్లడించింది. మొత్తంగా రూ.150 కోట్ల విలువ చేసే రూపే క్రెడిట్‌ కార్డుల అనుసంధాన ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపింది. ఎన్‌పిసిఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్‌ కార్డ్‌ పరిష్కారాలను అందిస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని 1.2 కోట్ల వ్యాపారస్తుల వల్ల ఈ చెల్లింపులకు వీలుందని వెల్లడించింది.

Spread the love