గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి

– క్రికెట్‌ విన్నర్‌ జట్టును సన్మానించిన బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కోహిర్‌ శ్రీనివాస్‌
నవతెలంగాణ-పెద్దేముల్‌
గ్రామీణ క్రీడాకారులను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రోత్సహించాలని పెద్దేముల్‌ బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు కోహిర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సోమ వారం మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోహిర్‌ శ్రీనివాస్‌ సమక్షంలో తాండూరు పట్టణంలో నిర్వహించిన పట్నం క్రికెట్‌ టోర్నమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో విన్నర్‌గా గెలుపొం దిన పెద్దేముల్‌ క్రికెట్‌ జట్టు ను శాలువాతో సత్కరించి సన్మానించారు. 2 లక్షల 50 వేలు విన్నర్‌ గెలుపొందిన పెద్దేముల్‌ క్రికెట్‌ జట్టు సభ్యు లకు అభినందనలు తెలిb ారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని యువకులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణిం చాలని సూచించారు. క్రీడల పట్ల యువకులకు తన వంతు సహకారం ఎప్పటికీ అందిస్తానని భరోసా కల్పిం చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు రంగయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు డివై ప్రసాద్‌, యువ నేతలు నరసింహులు గౌడ్‌, బంగ్లా రఘు, శశి కుమార్‌, మాధవరెడ్డి, మహేష్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love